Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
గత కొన్ని రోజులుగా భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. మంగళవారం పరిగి పట్టణ కేంద్రంతోపాటు పరిసర ప్రాంత గ్రామాల్లో కురిసిన వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిగి నుంచి తుంకుల గడ్డ వెళ్లే రహదారిపై నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణం చల్లబడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. చిన్నారులు సైతం కురిసిన వర్షం నీళ్ళలో ఆడుతూ ఆనందంగా గడిపారు.