Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని లింగన్‌పల్లి గ్రామంలో పొలాలకు సరఫరా అయ్యే విద్యుత్ తీగలు చేతికి అందే స్థాయిలో ఉండడంతో రైతులు భయాందోళనకు గురి అవుతున్నారు. గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నాగయ్య పొలంలో ఉన్న స్తంబాలు ఒరిగి విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడు తున్నాయి. ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులకు విన్న వించినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పొలంలో విద్యుత్ తీగలు వేలాడుతూ ఉండడంతో పొలం సాగుకు ట్రాక్టర్‌తో సాగుచేయడానికి రైతులు జంకుతు న్నారు. సంబంధిత విద్యుత్ అధికారులు పలుమార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యుత్ తీగలు సరిచేయాలని రైతులు వేడుకొంటున్నారు.