Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు
- పట్టించుకోని నాయకులు, అధికారులు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మూత్రశాలలు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. పట్టణానికి వివిధ రకాల పనుల నిమిత్తం సు దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు పట్టణంలో మూత్రశాలలు ఉపయోగంలో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం మూత్రశాలలు ఏర్పాటు చేసినప్పటికీ వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో మూతపడ్డాయి. కొన్ని చోట్ల ఉన్న మూత్రశాలలు మున్సిపల్ సిబ్బంది సరిగ్గా క్లిన్ చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని రేల్వే స్టేషన్ రోడ్లో ఉన్న మూత్రశాలలు రెండేండ్ల నుంచి పట్టించుకోవడం లేదు.
పట్టణ కేంద్రంలోని స్థానిక చీరల బజారులో ఆరు నెలల క్రితమే ప్రారంభించినప్పటికీ దాన్ని వాడడం లేదు. దూర ప్రాంతాల నుంచి వ్యాపారం కోసం వచ్చిన ప్రజలు అధికారులు చాలామంది అత్యవసర సమయాల్లో విసర్జనకు ఎక్కడ వెళ్లాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పట్టణ కేంద్రంలో మూతపడ్డ మూత్ర శాలలు ఉపయోగంలోకి తీసుకువచ్చి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని పలువురు వేడుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న వాటిని ఎప్పటికప్పుడు క్లిన్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.