Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్‌కుమార్
- అగ్నిమాపక వార్షికోత్సవాల పోస్టర్ విడుదల
నవతెలంగాణ-పరిగి
అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కు మార్ అన్నారు. మంగళవారం పరిగి పట్టణంలోని అగ్ని మాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలు పోస్టర్‌ను ము న్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం విపత్తు, అగ్నిమాపక సేవల శాఖ, అగ్నిమాపక పరికరాల నిర్వహాణే - అగ్ని ప్రమాదాల నిర్మూలనలో కీలకం అన్నారు. 1944 ఏప్రిల్ 14 తేదీన ముంబాయి విక్టోరియా డాక్ యార్డ్‌లో ఒక నౌకకు అగ్ని ప్రమాదం సంభవించి విధినిర్వహణలో అసువులు బాసిన 66 మంది అగ్ని మాపక దళ సిబ్బంది స్మారకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుం చి 20 వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారని అన్నారు. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బందికి జోహార్లు అర్పించడం మన కనీస బాధ్యత అని అన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్య వంతులను చేయడం ఈ వార్షికోత్సవాల ముఖ్య ఉద్దేశం అన్నారు. అగ్ని మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందనే మాట నిజమే కానీ దానిని ఉపయోగించడంలో మనం ఏమాత్రం పొరపాటు చ ేసిన అది మనకు ఎంత ప్రమాదం కలగజేస్తుందనేది అక్షర సత్యమని పేర్కొన్నారు. ఒక అతి చిన్న నిప్పు రవ్వను నిర్లక్ష్యం చేసిన అది మనకు అతి ఘోరమైన ప్రమాదం కలిగించవ చ్చు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాబట్టి అగ్ని విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదని సూచించారు. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అగ్నిమా పక యంత్రాంగం అహర్నిశలు ప్రజల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భీముడు, అగ్ని మాపక సిబ్బంది క్రిష్ణయ్యగౌడ్,లక్ష్మీ కాత్,శ్రీనివాస్ చంద్ర య్య, చంద్రయ్య, మధు, వెంకటయ్య, ప్రభాకర్, కౌన్సిలర్లు శ్రీను, కృష్ణ, నాయకులు ఎర్రగడ్డపల్లి కృష్ణ, రవి, రియాజ్, తదితరులు పాల్గొన్నారు.