Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ బద్ధ హక్కులకై పోరాటం చేయాలి
- టీఎస్‌యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవంలో జిల్లా అధ్యక్షులు వెంకటరత్నం పిలుపు
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం యా చించకూడదని, ఉద్యోగులకు రాజ్యాంగ పరంగా సంక్రమిం చిన హక్కుల కోసం పోరాటం చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని టీఎస్‌యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకట రత్నం అన్నారు. మంగళవారం టీఎస్‌యూ టీఎఫ్ 8వ ఆవిర్భవ దినోత్సవం నిర్వహించారు. మొదట సంఘం సీనియర్ నాయకులు రామచంద్రయ్య పతాకావి ష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఐదేండ్లుగా ప్రమోషన్లు లేక స్కూల్ అసిస్టెంట్, పండిత్, పీఈటీలు ఒకే క్యాడర్లో 18 నుంచి 35 సంవత్సరాలు పని చేయాల్సి వస్తుందని అన్నారు. పండితుల సమస్య మాత్రం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వస్తున్నాయని ఎన్నికల అనంతరం గాలికి వదిలేస్తున్నారని అన్నారు. సీనియర్ ఉపాధ్యాయులు ఓకే క్యాడర్లో సేవలందిస్తూ రిటైర్డ్ అవుతున్నారని దాంతో హౌదా పరంగా ఆర్థికమైన తీవ్రంగా నష్టపోతున్నారని తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేనద వ్యక్తం చేశారు. దీన్ని నివారించుటకు పోరాటాలు ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల చదివే విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు. ఏ ఒక్క పాఠశాలలో విద్యార్థులు కూర్చోవడానికి బల్లలు లేవని అన్నారు. గత రెండు దశాబ్దాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కేటా యించడం లేదని తద్వారా ప్రభుత్వ పాఠశాలలు దెయ్యాల కొంపలను తలపిస్తున్నాయని అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అన్ని మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన విద్య అందించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాదే అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బందెప్ప, జిల్లా కార్యదర్శులు బాబురావు, నవపేట్, వికారాబాద్, మర్పల్లి, కోట్‌పల్లి, బంటారం బా ధ్యులు వినోద్ కుమార్, పరమేష్ రాములు, రవీందర్, అజ రుకుమార్, సాబీర్అలీ, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.