Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో 35,550 ఎకరాల్లో వరి సాగు
- వానాకాలంతో పోల్చితే సగం విస్తీర్ణంలో సాగు
- ఒక్కసారిగా మొదలైన కోతలు
- వరి కోత యంత్రాలకు బలే గిరాకీ
- గంటకు రూ.2500 చార్జీ వేస్తున్న యంత్రయజమానులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
జిల్లాలో వరి కోతలు మొదలయ్యాయి. రైతులు జిల్లా వ్యాప్తంగా 35550 ఎకరాల్లో వరి సాగు చేశారు. 2.40లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. వానాకాలం 71613.11 ఎకరాల్లో వరి వేయగా, యాసంగిలో 35550 ఎకరాల్లో పంట సాగు చేశారు. గత ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండటం, బోరుబావుల్లో సమృద్ధిగా నీరు చేరడంతో ఆశతో రైతులు సాగు నీటికి కొదవలేకపోవడంతో యాసంగిలో పెద్ద ఎత్తున వరిపంట సాగు చేశారు. ఈ దఫా 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒకేసారి వరి కోతలు మొదలుకావడం, ఎండ తీవ్రత కారణంగా కూలీల కొరత ఏర్పడడంతో వరికోత యంత్రాలకు డిమాండ్ పెరిగింది. స్థానికంగా ఉన్న వరికోత యంత్రాలు సరిపోకపోవడంతో ఇతర జిల్లాల నుంచి హార్వెస్టర్లను జిల్లాకు వస్తున్నాయి. టైర్ల వాహనాలకు గంటకు రూ.2500 నుంచి రూ.3వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. డబుల్ గేర్ మిషన్లు, చైన్ వాహనాలకు గంటకు రూ.2500 డిమాండ్ ఉంది. డీజిల్, స్పేర్‌పార్ట్ రేట్లు, ఆపరేటర్ల వేతనాలు పెరిగాయని, దీంతో వరికోత యంత్రాల చార్జీలు పెంచక తప్పడంలేదని హార్వెస్టర్ యజమానులు పేర్కొంటున్నారు.
ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం
జిల్లాలో వరికోతలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే జిల్లాలో మొత్తం 30 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు సిద్దం చేవారు. కాగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, ఐకేపీ, పీఎసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ అమారుకుమార్ ప్రణాళికలు రూపొందించారు. ధాన్యం సేకరణపై కలెక్టర్ ఇప్పటికే సంబంధిత శాఖల అధికార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కొవిడ్ సెకండ్‌వేవ్ విజంభిస్తున్న తరుణంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయడంతో పాటు భౌతికదూరం, మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తరలించి, మద్దతు ధర పొందేలా అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో యాసంగీ సాగు విస్తీర్ణం
ఈ సీజన్లో జిల్లాలో మొత్తం 49408 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు. వీటిలో వరి 35550 ఎకరాల్లో సాగు చేశారు. అనుకున్న స్థాయిలో ధాన్యం దిగుబడి అవుతుందని అధికారులు అంచనా వేశారు. మొత్తంగా ఈ సారి 2.40మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. వీటిలో రైతు తమ అవసరాలకు వాడుకోవడం, రైస్‌మిల్లులకు ధాన్యం విక్రయించడం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
30 ధాన్యం కొనుగోలు కేంద్రాలు...
వానాకాలంతో పోల్చితే ఈ యాసంగీలో అదనంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్‌లో 30 వరకు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ యాసంగీలో 30కి తగ్గకుంట, అవసరమైన అదనంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అందుకు ప్రభుత్వానికి పౌరసరఫరాలశాఖ అధికారులు ప్రతిపాధించారు.
మాస్కులు దరించి కోతలు...
కరోనా నేపథ్యంలో వైరస్ వ్యాపించకుండా, కూలీలు మాస్కులు దరించి కోతలు కోస్తున్నారు. రైతులకు కూడా ఇదే ఎంతో ఉపశమని చెప్పవచ్చు. మరోవైపు ఉపాధిహామీ పనులు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు కారోనా విజృంభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధికి అదపు వేతనం పెంచింది. జిల్లాలో వరి కోతలకు కూలీల కొరత ఏర్పడింది. పైగా కూలీలు కోతలకు అదనంగా డిమాండ్ చేస్తున్నారు. దాంతో రైతులు కూలీల డిమాండ్‌ను బరించలేక యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు.