Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా శంషాబాద్లో బుధవారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో నీలి దండు కవాతు నిర్వహించారు. కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా నాయకుడు ఎర్ర వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బీ సామేలు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేయడానికి కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వరంగానికి చెందిన 16 సంస్థలను ఇప్పటికే అమ్మేసిందన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని, నూతన విద్యా విధానంతో దేశానికి ముసుగు ధరించి విద్యా కాషాయీకరణ చేస్తున్నారన్నారు. రాజ్యాంగ రక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అన్నాఆరు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) శంషాబాద్ మండల నాయకుడు నీరటి మల్లేష్, రైతు సంఘం నాయకుడు విక్రమ్ కుమార్, డీివైఎఫ్ఐ నాయకుడు బీ కుమార్, కేవీపీఎస్ మహిళా అధ్యక్షురాలు రాణి, జిల్లా అధ్యక్షురాలు అనురాధ, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆనంద్, ప్రణరు పాల్గొన్నారు.