Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్లో నిర్వహించిన కొవిడ్ పరీక్షలో 83 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు నజ్మా, దివ్య, రమ్య బుధవారం ప్రకటించారు. శంషాబాద్ క్లస్టర్ ఆరోగ్య కేంద్రంలో 115 మందికి పరీక్షలు చేయగా 44 మందికి వైరస్ సోకింది. పెద్దషాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 95 మందికి పరీక్షలు చేయగా 26 మందికి, నర్కూడ పీహెచ్సీలో 90 మందికి పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్ వచ్చింది. బాధితులందరికీ కోవిడ్ కిట్టు అందజేసినట్టు అధికారులు తెలిపారు. మంగళవారం నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో 48 పాజిటివ్ కేసులు వచ్చాయి. మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడలో ఇప్పటికే కరోనా కారణంగా నలుగురు వద్ధులు మృతిచెందారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు. ప్రధానంగా పాత శంషాబాద్ ఆర్బీ నగర్, మధురానగర్, తొండుపల్లి, ఉటుపల్లి ఏరియాల్లో కరోనా విజంభిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
టీకా తీసుకున్న ఎంపీడీవో, కౌన్సిలర్ మేకల వెంకటేష్
శంషాబాద్ ఎంపీడీవో వినరుకుమార్ పెద్ద షాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్టీకాను తీసుకున్నారు. శంషాబాద్ సీహెచ్సీలో కౌన్సిలర్ మేకల వెంకటేష్ టీకా తీసుకున్నారు. వారు మాట్లాడుతూ టీకా తీసుకోవడానికి ఎవరూ భయపడవద్దన్నారు. టీకా ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధి బారిన పడే అవకాశం తగ్గుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హమీదుల్లానగర్లో నిర్వహించిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. భౌతిక దూరం, మాస్కులు ధరించాలని కోరారు.