Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చందానగర్
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హుడా కాలనీ భవాని వైన్స్ దగ్గరలో వీరాంజనేయ కిరణం షాప్ ఎదుట గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందన్న సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అతని వయసు సుమారు 55 నుండి 60 ఏండ్లు ఉంటుందని తెలిపారు. మృతుడి కుడి చేయిపై లక్ష్మీ అనే పేరు, ఓం గుర్తు పచ్చబొట్టు ఉందని వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా గుర్తు పడితే 040-27853911, 7901113092, 100/040-2785308 నంబర్లకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.