Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
దోమ గ్రామంలో పంచాయతీ తరపున కరోనా కట్టడికి సంయుక్త చర్యలు చేపట్టారు. బుధవారం దోమ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న బజరంగ్ జ్యూవెలర్స్ నిర్వాహకులు దీపక్ దుకాణంలో వ్యాపారి మాస్కు ధరించనందుకు పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ రూ. వెయ్యి జరిమానా విధించారు. కరోనా నియంత్రణలో భాగంగా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని, తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.