Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యాధికారి మునీబ్
నవతెలంగాణ-దోమ
దోమ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డాక్టర్ మునిబ్ తెలిపారు. బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 70 పరీక్షలు నిర్వహించగా ఇందులో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణగా తేలిందన్నారు. పాజిటివ్ వచ్చిన వారిలో రాకొండలో ఒకరికి, బాసుపల్లిలో ఇద్దరికి, పాలేపల్లిలో ఒకరికి, ఐనపూర్లో ఇద్దరికి, మైలారంలో ఒకరికి, ఊటుపల్లిలో ఒకరికి, కుల్కచర్లలో ఒకరికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రాథమిక ఆసుపత్రిలో ప్రజలకు 35 మందికి వాక్సిషినేషన్ వేశాన్నారు. మండలంలో కరోనా రోజురోజుకు వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలన్నారు.