Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ శైలజా, పీఏసీఎస్ చైర్మెన్ దేవర వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-చేవెళ్ల
క్రీడాల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని చేవెళ్ల గ్రామ సర్పంచ్ బండారి శైలజా ఆగిరెడ్డి, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మెన్ దేవర వెంకట్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలో అంతారం గ్రామ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు గత 20 రోజులుగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలు బుధవారం ముగిశాయి. ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన చనుగోముల జట్టుకు రూ.20వేలు, షీల్డ్, రన్నర్ వికారాబాద్ జట్టుకు రూ.10వేలు తోపాటు షీల్డ్‌ను వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని సూచించారు. క్రీడాకారులు ఓటమితో కుంగిపోకుండా మళ్లీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు, శారీరక దృఢత్వానికి దోహదపడుతాయనీ తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అంతారం గ్రామ అంబేద్కర్ సంఘం సభ్యులు చేవెళ్ల గ్రామ సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి, చేవెళ్ల చేవెళ్ల పీఏసీఎస్ చైర్మెన్ దేవర వెంకట్ రెడ్డిలకు అంబేద్కర్ షీల్డ్ జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, నాయకుల, క్రీడాకారులు పాల్గొన్నారు.