Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి మండలంలో 37 కరోనా కేసులు నమోదైనట్టు ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు రేవతిరెడ్డి, షాదాబ్ తెలిపారు. బుధవారం శంకర్పల్లి ప్రభుత్వాస్పత్రిలో 91మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 67మందికి నెగటివ్ రాగా, 24మందికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు. హైదరాబాద్ రోడ్డులో 3, పత్తేపురంలో 3, శ్రీ రామ్నగర్ కాలనీలో 3, గంగారం లో 1, ఎలవర్తి గ్రామంలో 1, మాసాన్నిగూడలో 1, సింగాపురంలో 3, లక్ష్మారెడ్డి గూడలో 1, బ్లూమ్డ్స్లో 1, శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో 2, గీత మందిర్ కాలనీలో 1, ఓడీఎఫ్లో 4 కేసులు నమోదైనట్టు తెలిపారు. అదేవిధంగా టంగటూరు ప్రభుత్వాస్పత్రిలో 81 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 68 మందికి నెగిటివ్ రాగా, 13 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యా ధికారి డీఎస్జే పీబీ తెలిపారు. మహారాజ్పేట్ గ్రామంలో 1, పొద్దుటూరులో 4, చిన్న మంగళారంలో 3, మోకిలా తండాలో 2, మోకిలా గ్రామంలో 3, పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపారు. వీరితో పాటు ఎంపీహెచ్వో శ్రీనివాస్ తెలిపారు.
కుల్కచర్లలో 14కరోనా కేసులు : కుల్కచర్ల మండలంలో తాజాగా మరో 14 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి మురళీకృష్ణ కమ్యూనిటీ హెల్త్ అధికారి చంద్రప్రకాష్ తెలిపారు.బుధవారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 165మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 14మందికి పాజిటివ్ వచ్చినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. బిందెంగడ్డ తండాలో పాజిటివ్ వచ్చిన వారికి పలు సలహాలు సూచనలు చేశారు.