Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తాం
- విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
- హస్నాబాద్, చిట్లపల్లి గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాల ప్రారంభం
- చిట్లపల్లి, టేకులకోడులో రైతు వేదికలు ప్రారంభం
నవతెలంగాణ-కొడంగల్
దామరగిద్ద మండలంలోని కనుకుర్తిలో రిజర్వా యర్ను ఏర్పాటు చేసి, కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. కొడంగల్ మండలంలోని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా కొడంగల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులర్పించారు. హస్నాబాద్, చిట్లపల్లి గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించి, విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి, పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు.చిట్లపల్లి, టేకుల కోడ్ గ్రామాలలో రైతు వేదిక భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్మెన్ విజరు కుమార్, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారానికే రైతు వేదికలు నిర్మిస్తున్నామన్నారు. రైతుల కోసం 24 గంటల ఉచిత కరెంటును అందిస్తూ, రైతు బంధు వంటి పథకాలు అమలు చేస్తుందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా లక్షా 10 వేల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు నీరందడం కష్టంగా ఉండటంతో రెండు, మూడు దఫాలుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమావేశమైనట్టు తెలిపారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో సమావేశం నిర్వహించి, త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీలకు ఉన్నత విద్య అందించాలని గురుకుల పాఠశాలలు ప్రవేశపెట్టారన్నారు. 250 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సంపాదించారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ చైర్మెన్ జగదీశ్వర్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మెన్ కటకం శివకుమార్, కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీఓ అశోక్, ఏడీఏ వినరుకుమార్, టీిఆర్ఎస్ మండలాధ్యక్షుడు గోడలరామ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.