Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి వస్తే, మాస్కులు తప్పనిసరిగా ధరిం చాలని డీఎస్సీ శ్రీనివాస్, సీఐ అప్పయ్య, ఎస్ఐ సామ్యనాయక్ అన్నారు. బుధవారం కొడంగల్ పట్టణ పోలీస్ స్టేషన్ల్లో అంబేద్కర్ 130వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా డీఎస్పీ శ్రీనివాస్ హాజరై, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివి అన్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 జీవోలను జారీ చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి, ఎప్పటికప్పుడూ శానిటైజర్‌ను రుద్దుకోవాలని సూచించారు. 82 జీవో ప్రకారం ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలనీ, లేనియేడల రూ. వెయ్యి జరిమానా విధిస్తామన్నారు. 68 జీవో ప్రకారం భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. లేటెస్ట్ టెక్నాలజీతో పోలీసులు మాస్కులు లేనివారి ఫొటోలు తీసి, ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామన్నారు. మాస్కులు లేని వారికి, వారి మొబైల్‌కు రూ. వేయ్యి జరిమానా విధించినట్టు మేసేజ్ వస్తుందని చెప్పారు. ఆఫ్‌లైన్‌లో కానీ ఆన్లైన్ ద్వారా వెయ్యి రూపాయల జరిమానా కట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో దౌలతాబాద్ ఎస్ఐ విశ్వజాన్, దౌల్తాబాద్, బోంరాస్ పేట్, మండలాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.