Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచ్చలవిడిగా రసాయానిక ఎరువులు
- కాంప్లెక్స్ ఎరువుల వైపు పరుగులు
- అధిక దిగుబడులకు రైతులు చూపు
- అత్యధిక పెట్టుబడులు ఎరువులకే సరిపాయె...
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఆదిమ కాలంలో వ్యవసాయంలో రసాయాని ఎరువుల పాత్ర కేవలం 10శాతమ మాత్రమే. పశువుల, మేకల పేడ, కానుగ, ఇతర ఆకులను అడుగు ఎరువులుగా 90 శాతం వాడుకుని అధిక దిగుబడులు సాదించే వారు. కానీ కాలక్రమేనా.. వ్యవసాయంలో కాంప్లెక్స్ ఎరువుల వినియోగం రెట్టింపైంది.. సాగునీటి వసతి పెరగడం, పంటల సాగులో ఆధునిక, శాస్త్రీయ విధానాల అమలు ఇంకా ప్రయోగ దశలోనే ఉండడం వంటి కారణాలతో అనివార్యంగా రైతులు కాంప్లెక్స్ ఎరువుల వినియోగం పెంచుతున్నారు. పెట్టుబడుల్లో అధిక భాగం ఎరువులపైనే ఖర్చు చేస్తున్నారు. పంటలకు పెట్టుబడి సాయం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రధాన మంత్రి కృషి సంచారు యోజన, రైతుబంధు ప్రోత్సాహకాలు, ఎరువుల వినియోగానికే ఖర్చు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
అధిక దిగుబడులే లక్ష్యం...
వ్యవసాయంలో అధిక దిగుబడులే లక్ష్యంగా రైతులు ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలో నీటి వసతి, ప్రకృతి వైపరీత్యాలు, దిగుబడుల లక్ష్యం నేపథ్యంలో వ్యవసాయంలో ఎరువుల వినియోగం బాగా పెంచుతున్నారు. జిల్లాలో వరి, పత్తి సాగులో ఎరువుల వినియోగం ఎక్కువగా అధికంగా ఉంటుంది. ఇందులో యూరియా, కాంప్లెక్స్ ఎరువుల వినియోగం గణనీయోగిస్తున్నారు. జిల్లాలో సగటున పరిశీలిస్తే పత్తి సాగు చేసే రైతులు ఎకరాకు 90 కిలోల యూరియా, 150 కిలోల డీఏపీ, మరో 150 కిలోల కాంప్లెక్స్ ఎరువులు, మరో 50 కిలోల పొటాష్ వాడుతున్నారు. మొత్తం ఎకరాకు 340 కిలోల ఎరువులు వాడుతున్నారు. ఈ విధంగా రెండుసార్లు వాడుతున్నారు. ఇక వరి సాగు విషయానికి వస్తే 90కిలోల యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ కలిపి 250 కేజీలు వాడుతున్నారు. మొత్తంగా సగటున 340 కేజీల ఎరువులు వినియోగిస్తున్నారు. కందిసాగులో యూరియా 90కేజీలు, డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ కలిపి 200కేజీలు సగటున వాడుతుండగా, మొత్తం కంది సాగులో 300 కేజీల వినియోగం జరుగుతోంది. వేరుశనగ సాగులోనూ ఎరువుల వినియోగం పెరుగుతోంది. యూరియా 50 కేజీలు, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు 250 కేజీలు వాడుతుండగా, మొత్తం ఎకరాకు 300 కేజీల ఎరువులు వాడుతున్నారంటే రసాయానిక ఎరువులపై ఏ విధంగా వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఎకరాకు.. రూ.5వేల ఖర్చు...
జిల్లాలో ఎరువుల వినియోగానికి రైతులు ఎకరాకు ఒక పంటకు రూ.5 వేల చొప్పున ఖర్చు చేస్తున్నారు. వరి సాగును పరిశీలిస్తే ఎకరాకు రూ.5,500 ఎరువులకు ఖర్చు చేస్తుండగా, పత్తికి కూడా అదే స్థాయిలో రూ.5,465 ఖర్చు చేస్తున్నారు. ఈ విధంగా కూలీల ఖర్చు కూడా సమానస్థాయిలో పెరుగుతోంది. ఎరువులు, వ్యవసాయ కూలీల ఖర్చు సరిసమానంగా ఉంటుంది. ఒక ఎకరాలో సాగుకు అయ్యే ఖర్చుతో పోల్చితే... దిగుబడి కూడా రావడం లేదు.
తగ్గిన భూసారం...
రసాయనిక ఎరువుల వాడకం పెరిగిన తరువాత భూసారం తగ్గుతోంది. రైతులు భూసార పరీక్షలు చేయించుకోకుండానే మొక్కుబడిగా పంటలు వేస్తూ.. రసాయానిక ఎరువులను వాడుతున్నారు. మచ్చుకైనా సేంద్రీయ ఎరువుల వాడకం కన్పించడం లేదు. ఏ వైపు వ్యవసాయాధికారులు, వివిధ ఎన్జీఓ ఆధ్వర్యంలో సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచాలని సూచిస్తున్నా.. రైతులు పట్టించుకోవడం లేదు.
జిల్లాలో సాగు విస్తీర్ణం...
జిల్లాలో ప్రస్తుతం యాసంగీలో వరి 35550 ఎకరాల్లోసాగు చేశారు. శనగలు 6596ఎకరాలు, వేరుశనగ 1870ఎకరాలు, కుసుమలు 358, ఇతర పంటలు 5019ఎకరాల్లో సాగు చేశారు. ఇక వానాకాలంలో సాగు విస్తీర్ణం గణనీయంగా ఉంటుంది. గత వానాకాలంలో మొత్తం 471795ఎకరాల్లో సాగు చేశారు. వీటివలో వరి 71613ఎకరాల్లో సాగు చేస్తే.. కందులు 69808ఎకరాలు, పత్తి 273227ఎకరాల్లో సాగు చేశారు. జొన్నలు 28425ఎకరాల్లో సాగు చేశారు. పెసర్లు 518ఎకరాలు, మినుములు 140ఎకరాలు, ఆముదం 314ఎకరాలు, ఇతర పంటలు 27685ఎకరాల్లో సాగు చేశారు. ఈ సారి కూడా అదే స్థాయిలో సాగు చేసే అవకాశాలున్నాయి.