Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామరంగారెడ్డి
నవతెలంగాణ-హయత్‌నగర్
లింగోజిగూడలో జరగనున్న ఉప ఎన్నికలకోసమే అధికార టీఆర్ఎస్ పార్టీ, పార్టీ మారిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అంకెలగారడీ లెక్కలు చెప్తున్నారని బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామరంగారెడ్డి విమర్శించారు. గురువారం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని బీజేపీ ఆఫీసులో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో మాత్రమే కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రకటనలు ఇస్తున్నారని, వాటి కోసం కేవలం నెలల్లో నిర్మించిన రోడ్లను సైతం నాశనం చేసి ప్రజాధనాన్ని వృథా చేస్తున్న విషయాన్ని ఓటర్లు గమనిస్తున్నారని చెప్పారు. 2016లో అదే డివిజన్లో రూ. కోటి 81లక్షల వ్యయంతో చేసిన శంకుస్థాపన పనులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. మళ్లీ చేసిన పనులను నాశనం చేసే కొత్త పనులకు ఎలా టెండర్లు పిలుస్తారని ప్రశ్నించారు. ఎల్బీనగర్లో టీఆర్ఎస్ను ప్రజలు విస్మరిస్తే ఆ పార్టీకి ప్రజలు గుర్తుకొస్తున్నారని, పార్టీ మారిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అభివద్ది గురుంచి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఓటర్లను ప్రభావితం చేయడానికి ట్రంక్ లైన్ కానీ, డ్రెయినేజీ బాక్స్లైన్ పనులు గుర్తొస్తున్నాయన్నారు. పనుల్లో లెవల్స్ కలవకపోవడంతో నిర్మించిన వాటిని కూల గొట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన కార్పొరేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు 11 మంది కార్పొరేటర్లను గెలిపించారని చెప్పారు. ఈనెల 30న లింగోజి గూడలో జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే పై నుంచి వచ్చే వరద నీరు మూడు డివిజన్ల పరిధిలోకి రాకుండా కాపాడుతామని ఓటర్లకు హామీ ఇచ్చారు కార్యక్రమంలో చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్‌రెడ్డి, రవీందర్ రెడ్డిలు పాల్గొన్నారు.