Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్‌పేట
డ్రెయినేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. గురువారం అంబర్‌పేట డివిజన్ ఆకాష్నగర్లో రూ.13 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న డ్రెయినేజీ పైపులైన్ నిర్మాణ పనులను కార్పొరేటర్ ఇ.విజరుకుమార్గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో డ్రెయినేజీ పైపులైన్ వ్యవస్థను ఆధునీకీకరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. డ్రెయినేజీ సమస్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కార్పొరేటర్‌తో కలిసి ఆకాష్నగర్లో పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జలమండలి అధికారులు మహేష్, సతీష్, కుషాల్, డివిజన్ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, నాయకులు అమునురీ సతీష్, బాబ్లీ, యాసిన్, షరీఫ్, దయాకర్, దావూద్, రాగుల ప్రవీణ్ పటేల్, జుబేర్, హైమత్, జాకీబాబు, తిరుపతి, బాబా రఫీ, ఖలీల్, రంగు సతీష్, నర్సింగ్, శ్రీనివాస్‌గుప్తా, సలీం, జమీల్, హైమత్, దావూద్, దిలీప్, గౌస్ బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.