Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐ వి. స్వామి
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని సీఐ స్వామి అన్నారు. గురువారం అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పంచాయతీ పరిధిలోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో హ్యాండ్ ఆఫ్ హోప్ ఆశ్రయం, రియల్ ఇండియా మినిస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో మెగాహెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. మెగాహెల్త్ క్యాంపు ద్వారా వివిధ రకాల ఆరోగ్య పరీక్షలతో పాటు, ఈసీజీ, ఎక్స్ రే పరీక్ష నిర్వహించడం అభినందనీయమన్నారు. హెల్త్ క్యాంపులో సుమారుగా నాలుగు వందల మందికి పైగా పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో సరూర్ నగర్ మహిళా పోలీసు స్టేషన్ ఎస్ హెచ్ ఓ మంజుల, రియల్ ఇండియా మినిస్ట్రీస్ ప్రతినిధి గర్నిపూడి జయ కుమార్, హ్యాండ్ ఆఫ్ హోప్ ఆశ్రయం ప్రతినిధి జవహర్ కెన్నేడి, సురక్ష సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిక్కర గోపీ శంకర్, వైద్య సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.