Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
21వ దశాబ్దంలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు నైపుణ్యాలను అంచనా వేసేందుకు భారతదేశంలోనే ప్రీమియర్ క్రిటికల్ రీజనింగ్ ఫ్లాట్ ఫామ్ అయిన 'హెచ్సీఎల్ జిగ్ సా' ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహిస్తుందని హెచ్సీఎల్ కార్పొరేషన్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సుందర్ మహాలింగం గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 'హెచ్ సీఎల్ జిగ్ సా' అనే సరికొత్త పోటీని హెచ్సీఎల్ ప్రారంభిస్తుందని, ఇది విద్యార్థులు, యువతకు జ్ఞాపకశక్తి సామర్థ్యం ఎంత ఉందో అంచనా వేసి, వారు ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పద్దతి ప్రకారం, క్రమబద్ధంగా ఉండే పరిష్కారాల గురించి ఆలోచించేలా చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఉండే ఈ పోటీ వర్చువల్గా రెండు రౌండ్లలో నిర్వహిస్తారని, అవి క్వాలిఫయర్ 24 నుంచి 27 జూన్, ఫైనల్ 17 నుంచి 18 జులై నెలలో ఉంటాయన్నారు. ఈ పోటీలో పాల్గొంటే రూ.16 లక్షల విలువైన బహుమతులు, గాడ్జెట్లు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా మూడు అంశాలు పరిశోధన నైపుణ్యాలు, కమ్యూనికేషన్ విధానం, సూక్ష్మంగా ఆలోచించడం వంటి వాటిపై పోటీ ఉంటుందన్నారు.ఈ చాంపియన్ షిప్ పోటీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆసక్తి గల విద్యార్థులు, పాఠశాలలు మే31వ తేదీ లోపు షషష.ష్ట్రషశ్రీjఱస్త్రఝష.షశీఎ అనే వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చునని ఆయన సూచించారు.