Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
బీసీ నాయకులు, సర్పంచ్‌లపై బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కష్ణయ్య అన్నారు. బీసీ సర్పంచ్‌ను, నాయకులను బెదిరించిన భూపాలపల్లి శాసనసభ్యునిపై చర్యలు తీసుకోవాలని 14 బీసీ సంఘాలతో కలిసి గురువారం పత్రిక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. భూపాల్ పల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి బీసీ మహిళ సర్పంచ్ బండారి కవితను, ఆమె భర్త బీసీ సంఘం అధ్యక్షులు దేవేందర్‌ను దూషించి, చంపుతామని బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే గ్రామాల్లో కుల ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శాసనసభ్యునిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు.