Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి
నవతెలంగాణ-నారాయణగూడ
ప్రయివేట్ పాఠశాలలకు బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం ప్రకటించిన రూ.2 వేలు ఆర్థిక సాయం, 25 కిలోల బియ్యం పొందేందుకు దరఖాస్తు చేసుకునే గడువును పొడగించాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్.రెడ్డి గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సాంకేతిక కారణాలు, జనరల్ హాలీడేస్ ఎక్కువగా వచ్చి పని దినాలు తగ్గటంతో చాలా విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో వారి సిబ్బంది వివరాలను సమర్పించలేక పోయారన్నారు. డీఈఓలు, ఎంఈఓలు బోధనేతర సిబ్బంది, రేషన్ కార్డులు లేని వారికి, యూ-డైస్ లో నమోదు కాని, పాఠశాలలో రెగ్యులర్గా పనిచేసే స్టాఫ్ అందరికి ఇవ్వాల్సి ఉండగా కొంత మందికే అనేది సరికాదన్నారు. దీనిపై స్పష్టతనిస్తూ సిబ్బంది వివరాలను పొందుపరచడానికి 4, 5 రోజుల సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. గతేడాదిలాగానే ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ప్రమోట్ చేయాలంటే ఇప్పటికీ ఎఫ్-1 మాత్రమే నిర్వహించామని తెలిపారు. ఎఫ్-2 పరీక్షలు ఎవరి పాఠశాలలో వారే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అతి జాగ్రత్తగా రూమ్ కు 5నుంచి 10 మంది విద్యార్థులను ఉంచి పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలన్నారు. కార్యక్రమంలో ట్రస్మా గౌరవ అధ్యక్షులు జలజం సత్యనారాయణ, కోశాధికారి కె.శ్రీకాంత్ రెడ్డి, స్పోక్స్ పర్సన్ చింతల రాంచందర్, ఎగ్జిక్యూటివ్ జనరల్ సెక్రటరీ ఆరుకాల రామచంద్రా రెడ్డి, ప్రయివేట్ స్కూల్స్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు, జాతీయ ఉపాధ్యక్షులు కడారి అనంతరెడ్డి, హైదరాబాద్ అధ్యక్షులు, కోర్ కమిటీ మెంబర్ పి.జి.రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.అనిల్ కుమార్, హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాణాల రాఘవ, కోర్ రాష్ట్ర కమిటీ మెంబర్స్ శ్యామ్ సుందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, రఘు సురేష్, శ్యామ్ వెర్రా, జెగ్గు మల్లారెడ్డి, మారం లింగారెడ్డి, ఆర్.శ్రీనివాస్ రెడ్డి, ఆర్.రాంరెడ్డి, షఫీ, తదితరులు పాల్గొన్నారు.