Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడిపల్లి సీఐ అంజిరెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
కరోనా రెండో దశ విజంభిస్తున్న తరుణంలో ప్రజలు మాస్క్లులు లేకుండా బయటకు రాకుండా ఉండేందుకు వారికి హెచ్చరికలు జారీ చేసేలా జరిమనాలు విధిస్తున్నామని మేడిపల్లి సీఐ బీ.అంజిరెడ్డి తెలిపారు. ప్రజలను ఆర్థికంగా ఇబ్బందిపెట్టడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. ఈసందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాస్క్ ధరించినట్లైతే కరోనాను జయించడమే కాకుండా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండవచ్చునని తెలిపారు. మేడిపల్లి పీఎస్ పరిధిలోని అన్ని కెమెరాలను పోలీస్ స్టేషన్‌కు అనుసంధానం చేశామని, వాటి ద్వారా మాస్క్ లేకుండా తిరుగుతున్న వారిని గుర్తించి రూ. 1000 జరిమానా విధిస్తున్నామని తెలిపారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్క రోజే 16 మందికి జరిమానాలు విధించామని చెప్పారు. ప్రజలు ఇప్పటికైనా వ్యక్తిగత భద్రతతో పాటుగా ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలంటే కచ్చితంగా మాస్క్‌ను విధిగా ఉపయెగించాలని కోరారు.