Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజానాట్య మండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి కల్యాణ్
నవతెలంగాణ-మెహదీపట్నం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి కళ్యాణ్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మెహదీపట్నంలో ఏర్పాటు చేసిన సభలో వారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళలు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. దేశంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు అమ్మేస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నియంతృత్వ పోకడలతో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని కూడా అపహాస్యం చేస్తోందన్నారు. సమావేశంలో సీఐటీయూ నాయకులు మస్తాన్, హనుమంతు, అంజి, సంతోష్, జగదీష్, ఎల్లేష్, ఆదిలక్ష్మి, భూలక్ష్మి, రామాంజినమ్మ, పీఎన్ఎం రాష్ట్ర నాయకులు రాజు, జిల్లా నాయకులు గోపాల్, ప్రేమ్ కుమార్, భారతీ సుప్రియ, హరి కళాకారులు పాల్గొన్నారు