Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీస నర్సయ్య గౌడ్
నవతెలంగాణ-రాంనగర్
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పని చేస్తుందని సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు సీస నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. గురువారం బాగ్‌లింగంపల్లిలోని టీఆర్ఎస్కేవీ రాష్ట్ర కార్యాలయంలో సంఘం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అశ్వత్థామ రెడ్డి నేతత్వంలో పనిచేస్తున్న తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు టీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదన్నారు. అశ్వత్థామరెడి,్డ థామస్‌రెడ్డి యూనియన్ల పేరుతో వ్యక్తిగత ఎజెండాను అమలు చేస్తూ కార్మికుల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల భావోద్వేగాలను రెచ్చగొట్టి వారి ఆత్మహత్యలకు కారణమయ్యారని ఆరోపించారు. టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ నేతత్వంలో టీఆర్ఎస్ కార్మిక విభాగానికి అనుబంధంగా యూనియన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పి రామ అవతారం, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు మొహమ్మద్ కలీముల్లా, కార్యదర్శిలు బి ఎల్లమ్మ, లత, ప్రచార కార్యదర్శి ఆంజనేయులు, రాష్ట్ర కమిటీ సభ్యులు రవీందర్, నరసింహులు, భూషణ్, రూప తదితరులు పాల్గొన్నారు.