Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం శ్రీ త్యాగరాయగాన సభలో విక్రమ్ ఆర్ట్స్ అధ్యర్యంలో నిర్వహించిన సినీ, టీవీ కళాకారులకు ప్లవ ఉగాది పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ అభివద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పరిశ్రమకోసం పలు ప్రోత్సహకాలు ప్రకటించిందని గుర్తు చేశారు. షూటింగ్స్‌కు అనువుగా ఉండేలా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలో మంచి కళాకారులు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ తరపున ఢిల్లీ అధికార ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి మాట్లాడుతూ.. యువత కళా రంగంపై దష్టి పెట్టాలని సూచించారు. వేదికపై పోలీస్ ఉన్నతాధికారి రామదాసు, గాయని విజయలక్ష్మి ఉన్నారు. యువ జీవిత సాఫల్య పురస్కారం యువ గాయని మధుప్రియకు బహుకరించారు. ప్రత్యేక పురస్కారాలు రెలాగంగ, మేఘన, మోక్ష, నాగలక్ష్మి, పింటు కళలకు బహూకరించారు. రేగొండ నరేష్, నరేంద్ర రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులు విక్రమాదిత్య, వాణిరెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు. సభకు తొలుత రంజని సిస్టర్స్, దివ్య, సూర్య తదితరులు పాడిన పాటలు ఆకట్టుకొన్నాయి.