Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా కార్యదర్శి కె.జగన్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
జిల్లాలో అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని వ్యకాస జిల్లా కార్యదర్శి కె.జగన్ డిమాండ్ చేశారు. రెండేండ్లుగా నూతన పింఛన్ల మంజూరీ నిలిచిపోయిందన్నారు. అనేక మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. వారందరికీ పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా మార్చినెల పింఛన్ల ఇంకా పంపిణీ చేయడం లేదన్నారు. ఏప్రిల్ 15తేదీ పూర్తవుతున్నా.. నేటికీీ గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేయకపోవడం దారుణన్నారు. దాంతో జిల్లాలోని 166,820 మంది లబ్దిదారులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కనీసం వృద్ధులకు కూడా సకాలంలో పింఛన్లను ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం బాధాకరమ న్నారు. ప్రతినెలా వచ్చే క్రమం తప్పకుండా ఒకటవ తేదీరోజున అందజేయాలన్నారు.