Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరిగేషన్ అధికారులతో మరోమారు సమావేశం
- మంత్రి సబితాఇంద్రారెడ్డి చొరవతో ప్రభుత్వం ముందుకు ప్రతిపాదనలు
- ముఖ్యమంత్రి ఆమోదమే తరువాయి
- వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డిప్రతినిధి
ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవ ర్గాలకు సాగునీరు అందించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. శివన్నగూడెం నుంచి రాచకొండ ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులు నింపే ప్రతిపాదనల సర్వే పనులు పూర్తై డీపీఆర్ కూడా సిద్ధమైంది. మరోవైపు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉద్దండా పూర్ కుడికాలువ నుంచి గ్రావిటీ ద్వారా నీరం దించే విధంగా కూడా ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ రెండు ప థకాల ద్వారా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు సాగునీరందించే ప్రతిపా దనలపై అవగాహన, మార్పులు చేర్పుల కోసం, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి సబి తారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలతో సమావేశమై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. నగరంలోని ఎర్రమంజిల్ కాలనీలో ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఎమ్మె ల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఇలన్సీ మురళీధర్ ఇతర ఉన్నతాధికారులతో మరోమారు సమావే శమై పథకం తీరుతెన్నులపై సమీక్షించారు. ఈ రెండు పథకాల ద్వారా సాగునీరందించే ప్రణాళి కలను అధికారులు మ్యాపుల ద్వారా ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ ఏడాదిన్నర వ్యవధిలో ఈ రెండు నియో జకవర్గాలకు సాగునీరందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకుపోతున్నదన్నారు. ప్రణాళికల తయారీ తుదిదశకు చేరుకున్నదని, జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి చొరవతో ప్రభు త్వం ముందుకు ప్రతిపాదనలు చేరుతున్నాయని ఎమ్మెల్యే వివరించారు. సీఎం కేసీఆర్ సమక్షం లో త్వరలో జరిగే ప్రత్యేక సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని, ముఖ్యమంత్రి ఆమో దమే తరువాయి పనులు శరవేగంగా జరుగుతా యని చెప్పారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరందడమే కాక, 126 చెరువులు నింపే విధంగా ప్రణాళికలు రూపొందించామని ఎమ్మెల్యే తెలిపారు. సమీక్షా సమావేశంలో చీఫ్ ఇంజనీర్ రమేశ్, ఎస్ఇ శ్రీనివాస్, డీఈ జైపాల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణరెడ్డి, ఎంపీపీ కృపేష్, తదితరులు పాల్గొన్నారు.