Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రమోట్
- ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయం
- కరోనా ఎఫెక్ట్ తో రెండో ఏడాది కూడా పరీక్షలు రద్దు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
మరోసారి పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో.. అదేదారిలో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసింది. ఎస్ఎస్సీ బోర్డు ఎగ్జామ్స్‌ను రద్దు చేసింది.. ఇదే సమయంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేసింది. రెండో సంవత్సరం విద్యార్థుల పరీక్షలు వాయిదా వేసింది.
రాష్ట్రంలో టెన్త్ విద్యార్థులు 5.2 లక్షల మంది, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు నాలుగున్నర లక్షల మంది వరకు ఉన్నారు. జిల్లాలో సుమారు లక్ష మంది వరకు పది, ఇంటర్ చదువుకుం టున్నారు. ఇంటర్‌కు మే1 నుంచి 20 వరకు, టెన్త్ విద్యార్థులకు మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో, పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, కరోనా ఎఫెక్ట్‌తో గత నెల 24వ తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రభుత్వం మూసివేసిన విషయం తెలిసిందే.
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఈ నెల 1న జరగాల్సిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఈనెల 3న జరగాల్సిన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఇంటి నుంచి రాసి పంపించే అకాశాన్ని కల్పించింది. ఇక, ఈ నెల 7 నుంచి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ మే 29 నుంచి జూన్ 7 వరకు ఉంటాయని ఇప్పటికే ప్రకటించింది.
దీంతో టెన్త్, ఇంటర్ పరీక్షలు ఉత్కంఠ నెలకొనగా.. ఆ ఉత్కంఠకు తెరదించుతూ.. పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ.. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేస్తూ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు వాయిదా వేసింది.