Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణికొండ
మణికొండ మున్సిపాలిటీలోని పంచవతి కాలనీకి చెందిన డాక్టర్ అనిల్ చంద్రప్రియ కొడుకు వీరమళ్ల అథిక్ష్ కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం విన్నూత్న ప్రదర్శన చేశాడు. మాస్క్ ధరించి, శరీరం మొత్తం పీపీఈ కిట్ ధరించాడు. 'స్టే హౌమ్-స్టే సేఫ్' అని ప్లక్కార్డ్తో అవగాహన కల్పించాడు. చిన్నారి తల్లి చంద్రప్రియ ఎంతోమంది కరోనా పేషెంట్లకు సేవలందిస్తూ తనకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని చిన్నారి అథిక్ష్ కోరారు.