Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి చదువుకు తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ చేయూతనందించారు. తలకొండపల్లి మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన కే సుభద్ర ఇబ్రహీంపట్నం సమీపంలోని శ్రీ విద్యాంజలి కళాశాలలో డైయిరీ కోర్సులో మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్నది. ఈ మేరకు సుభద్ర భర్త యాదయ్య విన్నపం మేరకు ఆమె విద్యాఖర్చుల నిమిత్తం శుక్రవారం తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు. ఈ సాయాన్ని తన ప్రధాన అనుచరుడు బుచ్చిబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేష్ పాల్గొన్నారు.