Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్‌లో నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో శుక్రవారం 412 మందికి గాను 63 మందికి పాజిటివ్ వచ్చిందని శంషాబాద్ వైద్యాధికారులు నజ్మ, దివ్య, రమ్య తెలిపారు. శంషాబాద్ క్లస్టర్ ఆరోగ్య కేంద్రంలో 191 పరీక్షలకు గాను 33 మందికి పాజిటివ్‌గా తేలింది. నర్కూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 115 మందికి పరీక్షలు చేయగా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 80 మందికి వ్యాక్సినేషన్ వేసినట్టు తెలిపారు. పెద్దషాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 106 మందికి పరీక్షలు నిర్వహించగా 25 మందికి పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. 50 మందికి వ్యాక్సినేషన్ వేసినట్టు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారికి కోవిడ్ కిట్లను అందజేశారు.
క్లస్టర్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన చైర్ పర్సన్...
శంషాబాద్ క్లస్టర్ ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న కొవిడ్ పరీక్షలు, కల్పిస్తున్న సౌకర్యాలను మున్సిపల్ చైర్ పర్సన్ కే సుష్మమహేందర్ రెడ్డి శుక్రవారం సందర్శించి పరిశీలించారు. సౌకర్యాలు, టెస్టులు, టీకాల వివరాలను వైద్యాధికారిణి డాక్టర్ నజ్మను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శంషాబాద్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నదన్నారు. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్కులు, భౌతిక దూరం, శానిటైజర్ వినియోగం మరవద్దన్నారు. 45 ఏండ్లు నిండిన వారు టీకా తీసుకోవాలని డాక్టర్ నజ్మ కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు.