Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-కొత్తూరు
టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కొత్తూరు మున్సిపల్ పీఠం చేజిక్కించుకునేందుకు కలిసికట్టుగా పనిచేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొత్తూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని పాపిరస్ ఫోర్ట్ రిసార్ట్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారిని కొత్త, పాత తేడా లేకుండా టీఆర్ఎస్ కుటుంబంలో కలుపుకుని ముందుకు సాగాలన్నారు. టికెట్లు రాని వారెవరూ నిరాశ పడొద్దని సూచంచారు. రానున్న రోజుల్లో వారికి మంచి గుర్తింపు ఇస్తామని తెలిపారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు కషి చేసిన నాయకులకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులతో గౌరవిస్తామని తెలిపారు. మున్సిపాలిటీలోని 12 వార్డులోని అన్ని వార్డుల్లో విజయకేతనం ఎగురవేయాలన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివద్ధి చేసుకోవాలని చెప్పారు. అభ్యర్థులందరూ ఎవరికివారుగా నామినేషన్లు వేయవద్దని పార్టీ బీఫామ్‌లు అందజేసిన అభ్యర్థులందరూ ఒకేసారి నామినేషన్ వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కొత్తూరు మండల అధ్యక్షుడు పెంటనోళ్ల యాదగిరి, ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, నాయకులు ఎమ్మె సత్యనారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, బతుకు దేవేందర్ యాదవ్, వంకాయల నారాయణరెడ్డి, మెండే కష్ణ యాదవ్, జనార్దన్ రెడ్డి, తిమ్మాపూర్ ఎంపీటీసీ రాజేందర్ గౌడ్, క్రాంతి రెడ్డి, మున్నూరు పద్మారావు, రవి నాయక్, కోస్గి శ్రీనివాస్, డోలి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.