Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన కేంద్ర మాజీమంత్రి సముద్రాల వేణుగోపాల్చారి, ప్రభుత్వ విప్ గాంధీ
నవతెలంగాణ-చందానగర్
చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ ప్రధాన రహదారిపై గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ చైౖర్మెన్ గుడ్ల ధనలక్ష్మి ఆధ్వర్యంలో చలివేంద్రం, మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణు గోపాల్ చారి, ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం చల్లని మజ్జిగను కాలనీ వాసులకు అందచేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నగరంలో రోజురోజుకూ ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని తెలిపారు. ప్రజలు ఎండలకు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ కేంద్రాలు బాటసారులు, వాహనదారులకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. వేసవికాలంలో ప్రజల దాహాన్ని తీర్చడం గొప్ప విషయమని నిర్వాహకులు గుడ్ల ట్రస్ట్ చైౖర్మెన్ ధనలక్ష్మిని ఎమ్మెల్యే గాంధీ అభినదించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు దాసరి గోపి, జనార్దన్ రెడ్డి, అక్బర్ ఖాన్, సైదేశ్వర్, సురేందర్, రవి, రాము, జహీర్, వరలక్ష్మి, పార్వతి, భవాని, తదితరులు పాల్గొన్నారు.