Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-కొత్తూరు
గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించి అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం కొత్తూరుతండాకు చెందిన సుమారు వందమంది గిరిజనులు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ మా తండాలు మా రాజ్యాలు మాకు కావాలని గిరిజనులు ఎన్ని పోరాటాలు చేసినా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిందని తెలిపారు. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. పేద గిరిజన పిల్లలు చదువుకునేందుకు కొత్తూరు మండలానికి గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల మంజూరైందని తెలిపారు. గుంట భూమి ఉన్నా రైతు చనిపోయినా వారంలోగా రైతుబీమా ద్వారా ఆ కుటుంబానికి రూ.ఐదు లక్షల బీమా చెల్లిస్తున్నట్టు వివరించారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో గోవింద్ రెడ్డి, మోరే ప్రభాకర్ రెడ్డి, హనుమంతు నాయక్, చంద్రు నాయక్, గోపాల్ నాయక్, గోవింద్ నాయక్, ఆంజనేయులు, బాలు నాయక్, శంకర్ నాయక్, రాజు, సుశీల, శారద ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెంటనోళ్ల యాదగిరి, ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, నాయకులు ఎమ్మె సత్యనారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ గణేష్, జాండగూడెం సుదర్శన్ గౌడ్, మ్యాదరి శ్రీనివాస్, టీఆర్ఎస్ కొత్తూరు ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.