Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
భార్యాభర్తలు గొడువపడి, తల్లి గుళికల మందు తినడం గమనించిన బాలుడు తిని మృతి చెందాడు. ఈ ఘటన శంకర్పల్లి మండలంలోని పిల్లిగుండ్లలో శుక్రవారం చోటు చేసుకుంది. శంకర్పల్లి ఎస్ఐ లక్ష్మినారాయణ తెలిపిన వివరాల ప్రకారం మండ మండల పరిధిలోని పిల్లిగుండ్ల గ్రామానికి చెందిన దశరథకు జయమ్మ ,వసంత ఇద్దరు భార్యలు.( జయమ్మ ) కొడుకు రాఘవేందర్(7). వీరందరూ కలసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన గొడవపడగా భర్త దశరథ చనిపోతానంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మనస్తాపానికి గురైన ఇద్దరు భార్యలు పొలం వద్దకు వెళ్లి, విషపు గుళికలు తిన్నారు.( జయమ్మ )తన తల్లి గుళికలు మందు తినడం గమనించిన కొడుకు కూడా గుళికలు మింగాడు.ఇది గమనించిన స్థానికులు ముగ్గురిని హైదరాబాద్లోని వివిధ ఆస్పత్రిల్లో చేర్పించారు. గురువారం రాత్రి నిలోఫర్ ఆస్పత్రిలో బాలుడు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ మేరకు శంకర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.