Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీరజ
నవతెలంగాణ-శంకర్పల్లి
గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీరజ అన్నారు. మండల పరిధిలోని కొత్త పల్లి, పరివేద, మాసానిగూడ గ్రామాల్లో శుక్రవారం ఉపాధి హామీ పనులను కొత్తపల్లి గ్రామ పంచా యతీ అనుబంధ గ్రామమైన హుస్సేన్‌పురం గ్రామంలో జరుగుతున్న వరద మళ్లింపు కాలువల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండాకాలంలో కూలీలకు పనులు కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామా లలో జాబ్ కార్డ్ ఉన్న ప్రతి కూలీ పనులు లేవని చెప్పవద్దనీ, వారందికి పనులు కల్పించాలని సబం ధింత అధికారులకు తెలిపారు. అంతేకాకండా ఎప్పటికప్పుడూ కూలీలకు డబ్బులు వాళ్ల ఎకౌంట్లో వేయాలన్నారు. అక్కడే పనిచేస్తున్న రెండు శ్రమశక్తి సంఘాలు, సబంధించిన 48 మంది కూలీల అటెం డెన్స్ తీసుకున్నట్టు తెలిపారు. అనంతరం కొత్తపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించినట్టు చెప్పారు. మాసాన్నిగుడా గ్రామంలో చెక్ డాం పూడి కతీత పనిని 11 శ్రమశక్తి సంఘాలకు సంబంధిం చిన 76 మంది కూలీలు పని చేస్తుంటడం గమ నించి అభినందించారు. అక్కడినుంచి మాసాన్ని గూడా, పర్వేద నర్సరీలను పరిశీలించారు. నర్సరీలలో మొక్కలు చక్కగా పెంచారని , నర్సరీలో మునగ , కరివేపాకు, తులసి ,టేకు మొక్కలు తప్ప నిసరిగా పెంచాలని సూచించారు. పర్వేద పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. ఆమె వెంట ఎంపీ డీవో సత్తయ్య ,ఏపీఓ నాగభూషణం, టెక్నికల్ అసిస్టెంట్స్, పంచాయతీ కార్యదర్శులు,ఉన్నారు.