Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాడ్గుల
ఉపాధి కూలీలకు రోజుకూ కూలి ప్రభుత్వం రూ. 245 నిర్ణయించగా, వారికి రూ. 80 నుంచి రూ.100 మాత్రమే చెల్లించడమేమిటని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి జగన్, జాయింట్ సెక్రెటరీ అంజయ్య అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం మండలంలోని కొత్త బ్రాహ్మణపల్లి, పాత బ్రాహ్మణపల్లి, కాశగూడెం, ఇర్వీన్ గ్రామాలలో ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి కూలీలకు రోజు కూలీ రూ. 245 ఇవ్వాలని ప్రభుత్వమే నిర్ణయించినా, కేవలం రూ. 80 నుంచి రూ. 100 చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా కాలంలో ఉపాధి లేక అల్లాడు తున్న కూలీలు అరకొర కూలితో ఎలా కుటుంబాలను పోషించుకుంటారని నిలదీశారు. ఈ డబ్బులు కూడా సకాలంలో చెల్లించడం లేదన్నారు. కొన్ని గ్రామాల్లో ఉపాధి కూలీలకు 3 నుంచి 5 వారాల పాటు పెండింగ్ ఉన్న డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కొలతలతో సంబంధం లేకుండా కూలి ఇవ్వా లన్నారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 రోజులు ఉపాధి కల్పించాలని కోరారు. పనిప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించి, మెడికల్ కిట్లు,వోఆర్ఎస్ ప్యాకె ట్లు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసు కోవాలని కోరారు. ప్రతి కూలికి ప్రమాద బీమ సౌకర్యం కల్పించాలని చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాహిద్ (సర్పంచ్), నజీర్, గౌసియా, సా హిద్, కపూర, షబానా, వెంకటయ్య, మాధవి, వెంకట నారాయణ, ఎస్డీ పాషా,కలమ్మ, సంతోష, శ్రీ రాములు, పద్మ, అరుణ , రామచెంద్రి, మాధవి, రజిత, ఖాదర్, వెంకటమ్మ, జంగమ్మ, యాదగిరి జగన్, అచ్చయ్య, ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు