Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి మండలంలో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు రేవతిరెడ్డి, షాదాబ్ తెలిపారు. శుక్రవారం శంకర్పల్లి ప్రభుత్వాస్పత్రిలో 83మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 61మందికి నెగటివ్ రాగా, 22మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. హైదరాబాద్ రోడ్డు లో 2, సింగాపురంలో 4, వివేకానందనగర్ కాలనీలో 3,బీఎన్ఆర్ గార్డెన్లో 1, గణేష్ నగర్ కాలనీలో1, మర్పల్లిలో 1, మహాలింగాపురంలో 1, అంతప్ప గూడలో 1, మన్సాన్పల్లిలో 1, చిన్న శంకర్పల్లిలో 1, అల్ట్రాటెక్లో 1, సాయి కాలనీలో 1, పర్వేద గ్రామంలో 1, గొల్లగూడ గ్రామంలో 1, పోలీస్ స్టేషన్ సైడ్ లో 1 వచ్చినట్టు తెలిపారు.అదేవిధంగా టంగటూరు ప్రభుత్వాస్పత్రిలో 70 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 50మందికి నెగిటివ్ రాగా, 20 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు డాక్టర్ డి ఎస్ జె. పీబీ తెలిపారు. మహారాజ్పేట్లో 2, పొద్దుటూరులో 2, టంగటూరు 4, కొండకల్ లో 2, మోకిలాలో 3,కొత్తపల్లిలో 1, మోకిలాతండాలో 1, శేరిగూడలో 2, కమ్మెట 1, మహారాజ్ పేటలో 1, ఐబీపీఎస్లో 1, పిల్లిగుండ్ల 1 కరోనా కేసులు నమోదైనట్టు తెలిపారు. వీరితో పాటు ఎంపీహెచ్వో శ్రీనివాస్ తదితరులున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని మందులు ఎలా వేసుకోవాలో సూచనలు సలహాలు అందించినట్టు వైద్యాధికారులు చెప్పారు.