Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాచారం
గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులందరికీ ప్రభుత్వం పీఆర్సీని వర్తిపంజేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పెండ్యాల బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం యాచారం మండల కేంద్రంలో పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డీపీవో శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రాన్ని అంద జేశారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఉచితంగా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయాలని కోరారు. 11వ వేతన సవరణ చట్టం ప్రకారం పంచాయతీ కార్మి కులకు నెలకు రూ.19 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని పంచాయతీ కార్మికులకు వర్తింపజేయాలని కోరారు. గ్రామపంచాయతీలో పని చేస్తున్న కార్మికుల విషయంలో మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు.కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించాలని కోరారు. 2020 జనాభా లెక్కల ప్రకారం కార్మి కులను పెంచాలన్నారు. కార్మికులందరూ కరోనా ఇన్సెం టివ్ ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జంగయ్య, కార్మికులు శేఖర్, లక్ష్మయ్య, అంజమ్మ, యాదమ్మ, సుజాత, మల్లేష్, నరసింహా తదితరులు పాల్గొన్నారు.