Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు రామస్వామి
నవతెలంగాణ-చేవెళ్ల
ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి, కరోనాను కట్టడి చేద్దామని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు కే రామస్వామి అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో కరోనా టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్‌తో ఎలాంటి ప్రమాదం లేదన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న సీపీఐ మండల కార్యదర్శి సుధాకర్ గౌడ్ ,రైతు సంఘం నాయకులు సత్తిరెడ్డి గీత, పనివారల సంఘం నాయకులు కృష్ణ, సత్తయ్య కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. 45 ఏండ్లు పైబడిన వారందరూ ఎలాంటి రుగ్మతలు ఉన్న టీకా తీసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సెంటర్లలో కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తుందనీ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.