Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జరిమానాతో పాటు కేసులు నమోదు
- ఫొటోలు తీసి, చలానా మొబైల్‌కు పంపిస్తాం సీఐ అప్పయ్య
- బుధవారం నుంచి కూరగాయల మార్కెట్ ప్రారంభం
నవతెలంగాణ-కొడంగల్
కరోనా నిబంధనలు పాటించని వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని సీఐ అప్పయ్య అన్నారు.కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతుండటంతో కొడంగల్ పట్టణంలోని ఆటో, తుఫాన్, ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు, ప్రజలకు కరోనా నిబంధనలు పాటించాలని ఎస్ఐ సమ్య నాయక్‌తో కలిసి సీఐ అప్పయ్య ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సీఐ అప్పయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటించాలని 68, 69, 82, జీవోలను విడుదల చేసిందన్నారు. కరోనా కేసులు ఉధతంగా పెరగడంతో ప్రభుత్వం అమలు చేసిన జీవోల నిబంధనలను పాటిస్తూ కొడంగల్ సర్కిల్లోని దౌల్తాబాద్, బోంరాస్ పేట్, మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నత అధికారుల ఉత్తర్వుల ప్రకారం ఎస్ఐలతో కలిసి కోవిడ్ నిబంధనలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్ నియంత్రించేందుకు రవాణాకు ఉపయోగించే ఆటోలు, తుఫాన్లు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు ముఖ్యంగా మాస్కూలు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. వాహనం సామర్థ్యం,కోవిడ్ నిబంధనల ప్రకారమే ప్రయాణీకులను ఎక్కించుకోవాలని ఆటో, తుఫాన్, ఆర్టీసీ డ్రైవర్లకు, ఆర్టీసీ సిబ్బందికి అవ గాహన కల్పించినట్టు తెలి పారు. ఆటో, తుఫాన్ డ్రైవర్లు నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు. పండగలకు ఎలాంటి పర్మిషన్ లేవన్నారు. వ్యాపార సముదాయాలు మాస్కులు లేకుండా విక్రయించవద్దని, వినియోగదారులు మాస్కులు లేకుండా వస్తే, సరుకులు ఇవ్వవద్దన్నారు. మాస్కు లేని వారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తామన్నారు. వాహనాలపై వెళ్తున్న వారికి హెల్మెంట్, సిగల్ జంప్ చేసిన వారికి ఈ చలానా ఏవిధంగా విధిస్తారో , అదే విధంగా మాస్కు లేనివారికి ఈ చలానా వేయనున్నట్టు తెలిపారు. ఒక వ్యక్తికి ఈ చలానా వేసేటప్పుడు సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా చేసుకుని ఈ చాలన్ విధిస్తామన్నారు. కొంత మంది సెల్‌పోన్ నెంబర్లు తప్పు చెప్పే అవకాశం ఉందని ఉద్దేశంతో తెలంగాణ పోలీసులు ఒక యాప్‌ను డవలప్ చేసిందని చెప్పారు. మాస్కులు ధరించని వారికి ఈ యాప్ ద్వారా సెల్ ఫోన్ నెంబర్‌కు ఓటీపీ ద్వారా జరిమానా వస్తుందన్నారు. కొడంగల్ పట్టణంలో ప్రతి బుధవారం నిర్వహించే కూరగాయల మార్కెట్‌ను వ్యవసాయ మార్కెట్లో బుధవారం నుంచి కూరగాయల మార్కెట్ ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.