Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు రాని సమావేశాలెందుకు?
- ఆర్టీసీ సమస్యలు కండక్టర్కేం తెలుసు?
- ఎక్సైజ్‌శాఖ తీరుపై కానిస్టేబుల్ సమాధానాలా?
- ఆర్టీసీ డీఎం, ఎక్సైజ్ సీఐ ఎందుకొస్తలేరు..
- ఎజెండా నోట్ ఇవ్వని శాఖలపై చర్యలేవి ?
- మూడు ప్రభుత్వ శాఖల తీరుపై సభ్యుల ఆగ్రహం
- వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- వాడీవేడిగా ఇబ్రహీంపట్నం మండల సర్వసభ్య సమావేశం
''మూడు నెలలకొకసారి.. అదీనూ ఒక్క రోజే.. అందులోనూ సగం పూట.. ఆ మాత్రం కూడా సమయం ఇవ్వలేని అధికారులు ఎందుకు? తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి. అంత తీరిక లేని అధికారులు ఏం చేస్తున్నారు. అసలు అధికారులే రాని సమావేశాలు ఎందుకు? ఎవరికోసం. అసలు సభకు రావాలా? వద్దా? ఆర్టీసీ సమస్యలపై కండక్టరుకేం తెలుసని సమాధానాలు ఇస్తారు? ఎక్సైజ్ శాఖలోని సమస్యలపై హెడ్ కానిస్టేబుల్ వివరణ తీసుకోవాలా? మా సమస్యలు వారు తీరుస్తారా? విద్యుత్‌శాఖ అనేది పనిచేస్తుందా.. తీరా చూస్తే మండల సమావేశానికి ప్రభుత్వశాఖలు తమ ఎజెండాను అందజేయరా? ఆయా శాఖలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అసలు సమావేశానికి రావాలా? వద్దా'' ఇదీ ఇబ్రహీంపట్నం మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ప్రభుత్వ అధికారులపై సభ్యులు మండిపడ్డారు. సమస్యలపై నిలదీశారు. మండల సర్వసభ్య సమా వేశాలను చులకన భావంతో చూస్తున్న అధికారుల తీ రును నిరసించారు. వారి వ్యవహార శైలిపై మండి ప డ్డారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అధ్యక్షులు కృ ఫేష్ అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ శాఖలపై చర్చించారు. ఆర్టీసీ అధికారులు బస్సు ట్రిప్పు లను గ్రామాలకు నడిపించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని సర్పంచులు రాంరెడ్డి, బల్వంత్‌రెడ్డి, గీత మండిపడ్డారు. సర్వీసులను ఎందుకు బయటకు తీయడం లేదని ఆగ్రహించారు. ఆదాయం కావాలా? ప్రజల అవసరాలు తీరాలా? ఆర్టీసీ ఏదీ ముఖ్యమని ప్రశ్నించారు. డిపోల్లో బస్సులున్నా రోడ్డెక్కనియడం లేదని, వాటిని డిపోలకే పరిమితం చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ఉంచడానికా? ముంచ డానికా? అని నిలదీశారు. అసలు డిపోలో బస్సులు ఉ న్నాయా? అమ్మేశారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశా రు. బస్సులను గ్రామాలకు నడిపించడంలో హైదరా బాద్‌లో లేని నిబంధనలు గ్రామీణ ప్రాంత డిపోలకే ఎందుకు అడ్డు వస్తున్నాయని ప్రశ్నించారు. కనీసం ప్రజా ప్రతినిధులు వెళ్లి డీఎంకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పైగా మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య స మావేశానికి డీఏం రాకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నిం చారు. తమ ప్రశ్నలకు కండక్టర్ ఏం సమాధానం చెబుతారని ఆగ్రహించారు. రాసుకునిపోవడమే తప్ప ఏం సమస్య పరిష్కరిస్తాడని నిలదీశారు. పాత చాట్ ప్రకారమే గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడిపించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ సమావేశాల్లో ఆర్టీసీ సమస్యలపై చర్చించేందుకు డీఎంను రప్పించాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదని, ఆయనపై చర్యలు తీసుకునే విధంగా ఏకగ్రీవ తీర్మా నం చేసి, జిల్లా కలెక్టర్‌కు నివేదించాలని సభ్యులు ప ట్టుబట్టారు. అందుకు సభ తీర్మానించింది. అనంతరం ఎక్సైజ్‌శాఖపై జరిగిన చర్చలో హెడ్ కానిస్టేబుల్ వచ్చి సమాధానం ప్రయత్నం చేశారు. దాంతో సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. కానిస్టేబుల్ వచ్చి సమాధానాలు చెబితే వినాల్సిన దుస్థితి తమకు ఏర్పడిందని, ఇంత దౌర్భాగ్యం వస్తుందనుకోలేదని స భ్యులు మండిపడ్డారు. ఎక్సైజ్‌శాఖ తరపున వచ్చిన హె డ్ కానిస్టేబుల్‌ను సమాధానాలు చెప్పకుండా వేదిక నుంచి పంపించేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చెట్లనీ డలు, ఆ పరిసరాలు ముందు బాబుల నిలయాలుగా మారిపోతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ఏ చెట్టు కింద చూసినా పగిలిన మద్యం సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులే దర్శనమిస్తున్నాయన్నారు. ఎక్సైజ్ శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. గ్రామాలు మద్యం కేంద్రాలు గా మారుతున్నాయన్నారు. వీటికి సీఐ స్థాయి అధికారి సమాధానం చెప్పాల్సి ఉందని, అలాంటి అధికారి మం డల సర్వసభ్య సమావేశానికి రాకపోవడం సరికాదన్నా రు. రెవెన్యూశాఖ అవినీతిలో కూరుకుపోయిందని రాంరెడ్డి మండిపడ్డారు. భూ సర్వేయర్‌కు సామాన్యు లు కనిపించడం లేదన్నారు. భూముల సర్వే కోసం చేసుకున్నా దరఖాస్తులు రెవెన్యూ కార్యాలయంలో చెల్లుబాటు కావడం లేదని ఆయన విమర్శించారు. పైరవి కారుల పనులు చకచకసాగిపోతున్నాయని చెప్పారు. సామాన్యుల పని సంవత్సరాలుగా పెండింగ్ లోనే ఉంటుందని మండిపడ్డారు. గత్యంతరం లేక పేద రైతులు ప్రయివేటు సర్వేయర్లను ఆశ్రయించి లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం మండలం లో సర్వేరు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియని దుస్థితి ఏర్పడిందన్నారు. వారికి జీతాలతో సంబంధం లేదన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోందని ఆందో ళన వెలిబుచ్చారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. వానాకాలంలో సన్నాలు సాగు చే యాలని ప్రభుత్వం చెప్పిందని, కానీ ఆ ధాన్యం కొనుగోలు చేయడంలో ఇబ్బందులకు గురి చేశారని వైస్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. కనీసం యాసం గిలోనైనా ధాన్యం కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. దిగుబడి వచ్చిన ధాన్యా న్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు వ్యవసాయ అధికారులు రైతులకు టోకెన్లు అందజేయాలన్నారు. రైతు బీమా చేసుకునేందుకు ఇంకా 30శాతం మంది రైతులు ముందుకు రావడం లేదని, వారిని చైతన్యం చేసి రైతు బీమా చేసుకునే విధంగా ప్రజా ప్రతినిధులు సహకరించాలని వ్యవసాయ అధికారి వరప్రసాద్ కోరారు. జామ, మామిడి, అంజీర సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని ఉద్యానవన శాఖ అధికారి కనకలక్ష్మి సూచించారు. జిల్లాలో మల్చింగ్ సాగు వి ధానం పెరుగుతోందన్నారు. దీన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు రైతులను చైతన్యవం తులను చేయాలని ఆమె కోరారు. సబ్సిడీ కింద వ్యవసాయ పరికరాలు అందజేయనున్నామని రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని వైద్యాధికారులు రాజ్యలకిë తెలిపారు. ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోక పోవడమే కారణమనిన్నారు. వెల్మినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో కేవలం 10 కేసులు తక్కేవే నమోదైతే ఏప్రిల్ మాసంలో 98 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రజలు మాస్కులు వాడకపోవడం, శానిటైజర్ ఉపయోగించకపోవడమే ప్రధాన కారణమని తెలిపారు. విద్యుత్ అధికారులు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పడ్డారు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని కేవలం ప్రధాన ఎజెండాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ప్రతాపరెడి,్డ ఎంపీడీవో మహేష్‌బాబు, పంచాయతీరాజ్ డివిజనల్ అధికారి శ్రీనివాసరెడ్డి, ఈఓఆర్డీ మహేష్, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.