Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఎంకేఆర్ ఫౌండేషన్ అభ్యర్థులకు స్టడీమెటీరియల్ పంపిణీ
నవతెలంగాణ-రంగారెడ్డిప్రతినిధి
ప్రభుత్వ ఉద్యోగం సాధించేవరకు విశ్రమించొద్దని, ఎంకేఆర్ ఫౌండేషన్ మీకు వెన్నంటి ఉంటుందని ఎమ్లెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి యవతకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాల సాధన కోసం ఎంకేఆర్ ఫౌండేషన్ నిర్వహించే ఉచిత శిక్షణా శిభిరానికి ఎంపికైన మహిళా అభ్యర్థులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపికైనా అభ్యర్థులనుద్దేశించి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనే యువతరం ఆశలకు తగు తోడ్పాటు అందించడం కోసమే ఎంకేఆర్ ఫౌండేషన్‌ను స్థాపించినట్టు తెలిపారు. కరోనా మహామ్మారి విజృంభిస్తున్న సమయంలో అభ్యర్థులు ఇంటివద్ద చదువుకోవడానికి తగు విధంగా స్టడీ మెటిరియల్‌ను తయారు చేయించి పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఎంకేఆర్ ఫౌండేషన్ ఉచిత శిక్షణ శిబిరానికి 704మంది అభ్యర్థులు ఎంపికకగా, వారితోపాటు మిగిలిన వారికి అందుబాటులో ఉండే విధంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఈ స్టడీ మెటిరియల్‌ను అందుబాటులో ఉంచుతున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఉద్యోగాల సాధనకు సిద్ధమవుతున్న యువతరం కరోనా ఉధృతి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అందరికి దూరంగా పరీక్షలకు సిద్ధమవ్వాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పెండ్లిలు, పెరంటాలకు దూరంగా నాలుగు నెలల సమయాన్ని అభ్యర్థులు తమ పరీక్షలకు పూర్తిస్థాయిలో కేటాయిస్తే వారి జీవితం గాడిలో పడుతుందని తెలిపారు. కరోనా ఉదృతి తగ్గగానే తరగతులను ప్రారంభించి అభ్యర్థులకు అన్ని విధాలుగా అండగా నిలుబడుతామని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణరెడ్డి, ఎంకేఆర్ ఫౌండేషన్ కార్యదర్శి జర్కోని రాజు, మడుపు శివసాయి, మంద సురేష్, సిద్ధంకి కృష్ణారెడ్డి, కరుణాకర్, దయాచారి, చెనమెని శివ, శేఖర్‌యాదవ్, దేవేందర్‌గౌడ్, నిరంజన్ముదిరాజ్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.