Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-టిఎంకెఎంకెఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
గొరెంకల నరసింహ
నవతెలంగాణ-మంచాల
మత్స్య కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలంగాణ మత్స్య కారుల కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి గొరెంకల నరసింహ డిమాండ్ చేశారు.ఆదివారం మండల పరిధిలోని తిప్పాయిగూడ గ్రామంలో ఆయన మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో కాపాడాల్సిన పాలకులు ప్రజల ప్రాణాలను గాలికి వది లెశారని దీంతో ప్రజలు పిట్టల్ల రాలిపొతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తిప్పాయిగూడ గ్రామంలో మత్స్య కారులు చేపలు పడుతుండగా వారి దగ్గరకు వెల్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. కరోనా రెండవ దశ విజంభిస్తున్న సందర్భంగా మే 11న తెలంగాణ రాష్ట్రంలో మత్స్య కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, కరోనాలో మత్స్యకారులను ఆదుకునేందుకు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులందరూ 11న జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్ కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కాకుండా పోలియో చుక్కుల కార్యక్రమం లాగా గ్రామాలకు వచ్చి వ్యాక్సిన్ వేయాలని తెలిపారు. మత్స్యకారుల కుటుంబాలకు 50 ఏండ్లు నిండిన వారికి వృద్దాప్య పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సహజ మరణానికి ఇన్సూరెన్స్, ఎక్స్గ్రేషియా ఇవ్వాలని తెలిపారు. ఈ సమస్యలపై మే 11న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సంఘం గ్రామ ఉపాధ్యక్షులు మాదాసు యాదయ్య, చెక్క చిన్న కిష్టయ్య, కార్యదర్శి చెక్క పెద్ద కిష్టయ్య, గొరెంకల గాలయ్య, యాదయ్య, కష్ణ, చెక్క శ్రీ శైలం, గొరెంకల గోపాల్, బాల క్రిష్ణ, మాదాసు లింగ స్వామి, చెక్క సురేశ్ తదితరులు ఉన్నారు.