Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
జిల్లా కేంద్రం, తాండూర్‌లో ఆస్పత్రుల సందర్శన
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి సందర్శన
నవతెలంగాణ- వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లాకేంద్రంలో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మహేంద ర్‌రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ కాలనీలో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిని, తాండూరు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన కోవిడ్ కేర్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రానున్న మూడు రోజుల్లో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్స్ కూడా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఫీవర్ సర్వేలో గుర్తించిన అనుమానితులను పర్యవేక్షిస్తున్నారు. అనుమానం ఉన్న వారికి టెస్టులు నిర్వహించి సంబంధిత జాగ్రత్తలు తీసుకోమని అవగాహన కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. ప్రజలు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించి అత్యవసర సమయంలోనే బయటకు రావాలన్నారు. జ్వరం, దగ్గు, జలుబు ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షా చేసుకోవాలన్నారు. వికారాబాద్ జిల్లాలో కోవిడ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 18005996863 కి ఫోన్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు. ప్రజలు కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళి కృష్ణ్ణగౌడ్, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, తాండూర్ చైర్పర్సన్ స్వప్న, పార్టీ నాయకులు. ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.