Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-స్నేహితుడి మరణం కలిచివేసి బాధిత కుటుంబానికి రూ.20 వేలు ఆర్థిక సాయం
స్నేహితుడి కూతురు చదువుకయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని తెలిపిన వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-చేవెళ్ల
తన స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని, స్నేహాన్ని చాటుకున్నారు చేవెళ్లకు చెందిన ఎల్ఐసీ ఏజెంట్ కిచెన్నగారి వెంకట్రెడ్డి. చేవెళ్ళ మండలం కందవాడ గ్రామానికి చెందిన వడ్ల భాస్కరాచారి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆదివారం వెంకట్ రెడ్డి, భాస్కర చారి కుటుంబాన్ని పరామర్శించారు. తన స్నేహితుడు భాస్కర చారి మరణం తనను కలిచి వేసిందని తన బాధను వ్యక్తం చేశారు. స్నేహితుడి భార్య ఉమారాణి ఇద్దరు కూతుళ్లు వర్శిత, అక్షితలకు దైర్యం చెప్పారు. వారి కుటుంబానికి 20 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు. అదేవిధంగా 8 వ తరగతి చదువుతున్న స్నేహితుడి కూతురు వర్శిత భవిష్యత్తులో ఎంత చదువుకుంటే ఆ చదువుకు అయ్యే పూర్తి ఖర్చులు తానే భరిస్తానని వారికి హామీ ఇచ్చారు. తన స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకుని తన స్నేహాన్ని, మనవత్వాన్ని చాటుకున్నారని పలువురు ఆ గ్రామస్తులు, కందవాడ గ్రామ సర్పంచ్ సాయిరెడ్డి, ఉప సర్పంచ్ కృష్ణ, సీనియర్ నాయకులు బలవంత్ రెడ్డి, గుండాల స్కూల్ ఎస్ఎస్సీ 1992 బ్యాచ్ స్నేహితుడు రాఘవ రెడ్డి వెంకట్రెడ్డిని కొనియాడార