Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి
తాండూర్‌లో ఐసోలేషన్ కేంద్రం పరిశీలన
నవతెలంగాణ-తాండూరు
కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. తాండూరులో మాత శిశు సంరక్షణ కేంద్రంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు కోవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెంటర్‌ను ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌లతో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారె డ్డి పరిశీలించారు. వేరు వేరుగా ఏర్పాటు చేసిన మహిళలు పురుషుల వార్డు లు, ఐసీయూ సెంటర్, ల్యాబ్, ఐసోలేషన్ వార్డులను పరిశీలించారు. అనంత రం ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ఐసోలేషన్ సెంటర్‌ను అందుబాటులోకి తేవాల న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోవిడ్ పరిస్థితులపై నిరంతర పర్యవేక్ష ణ చే స్తూ, అధికారులను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. కోవిడ్ కేర్ సెంట ర్లో 18 మంది డాక్టర్లు, 12 మంది నర్సులు మూడు షిఫ్ట్‌లలో వైద్య సేవ లు అందించాలన్నారు. మాత శిశు సంరక్షణ కేంద్రంలో 75 ఆక్సిజన్ బెడ్లు, 15 ఐసియూ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో కోవిడ్ హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 18005996863 కు ఫోన్ చేసి సహా యం పొందవచ్చని అన్నారు. ప్రజలు కోవిడ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.