Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుల్కచర్ల
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన కుల్కచర్ల మండలం ఘనపూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఘనపూర్ గ్రామానికి చెందిన నర్సింహులు తన ఇద్దరు భార్యలతో కలిసి తన వ్యవసాయ పొలంలో రేకుల షెడ్డు నిర్మించుకోని నివసిస్తున్నారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి భోజనం చేసి నిద్ర పోయారు. నరసింహులు రెండవ భార్య ఎల్లమ్మ (48) తమ వ్యవసాయ అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న నీటి గొంతలో శవమై తేలింది. ఎల్లమ్మ మృతిపై తన కుమారుడు అనుమానం వ్యక్తం చేశారు. కొడుకు బీరప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.