Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 వరకు కొనసాగింపు
లాక్‌డౌన్‌కు వ్యాపారస్తులు సహకరించాలి
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలో రేపటి నుంచి తాండూర్‌లో లాక్డౌన్ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్‌రెడ్డి తెలిపారు. దీనికి వ్యాపారస్తులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఆదివారం తాండూరు పట్టణ కేంద్రం లో వివిధ వ్యాపారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. రోజురోజుకూ కరోనా పెరుగుతున్న సందర్భంగా తాండూరు పట్టణ కేంద్రంలో 14 రోజుల పాటు లాక్డౌన్ విధించేందుకు వ్యాపార స్తులతో పాటు ప్రజలు కూడా సహకరించాలన్నా రు. రోజు ఉదయం 6 గంటల నుంచి 12 గం టల వరకు మాత్రమే ఓపెన్ ఉండేలా చూడాల న్నారు. అదేవిధంగా ఆదివారం పూర్తిగా లాక్‌డౌ న్ ఉండే విధంగా చూడాలన్నారు. వ్యాపారస్తు లు, పలు సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో అందరి సూచనల మేరకు కరోనా నివారణకు లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువుల కోసం సమయం ఇవ్వగా ఆదివారం పూర్తిగా లాక్డౌన్ పాటించాలని నిర్ణయించారు. కరోనా మహమ్మారి కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలందరూ కూడా లాక్డౌన్ ఆంక్షలు ఖచ్ఛితంగా పాటించాలని, పోలీసు అధికారులకు అందరూ కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్నపరిమల్, వైస్ చైర్పర్సన్ దీపా, వ్యాపారస్తులు, తదితరులు పాల్గొన్నారు.